స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీసు
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై మార్చి 7 తర్వాత సమ్మె చేయనున్నట్లు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో కార్మిక సంఘాలు గురువారం సెంట్రల్ స్టోర్స్ కూడలి నుంచి ఉక్కు అడ్మిన్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. అక్కడ జరిగిన సమావేశంలో సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను దొడ్డిదారిన తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సుమారు 300 మందిని తొలగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎస్‌ఎంఏ, ఏఎస్‌ఎంఏను తొలగించాలని చూస్తున్నారన్నారు. పాత పద్ధతిలో గేటు పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల్లో నిర్వాసిత ఖాళీలను నిర్వాసితులతోనే భర్తీ చేయాలన్నారు. అనంతరం ప్లాంట్ యాజమాన్య ప్రతినిధులకు సమ్మె నోటీసు అందించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, మంత్రి రవి, వంశీ, కోన అప్పారావు, ఉమ్మిడి అప్పారావు, వి.వి.రమణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మార్చి 7 తర్వాత సమ్మె
Comments
Please login to add a commentAdd a comment