అల్లిపురం: ప్రేమ సమాజంపేద గిరిజనులకు సహాయం చేసే విషయంలో ముందుంటుందని అధ్యక్షుడు బుద్ద శివాజీ అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆశ్రమంలో చేరిస్తే వారికి చక్కటి భవిష్యత్తు కల్పిస్తామని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో అరకు వ్యాలీ చుట్టు పక్కల సుమారు వెయ్యి మంది పేద గిరిజనులకు రగ్గులు, దుప్పట్లు, లీటర్ వంట నూనె, కేజీ బంగాళాదుంపలు అందించారు. అక్కడి నవజీవన్ బాయ్స్, గర్‌ల్స్ హాస్టల్, అన్నపూర్ణ హాస్టల్లోని సుమారు 150 మంది విద్యార్థులకు దుప్పట్లు, రేషన్ సరకులు అందించారు. అరకు మండలం, మాడగడ పంచాయతీ, తాంగుడుగుడ గ్రామంలో పేద గిరిజనులకు రేషన్ సరకులు అందజేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ఎటువంటి ఆసరా లేని వృద్ధులను ప్రేమ సమాజంలో చేర్పిస్తే ఆశ్రయం కల్పించి వైద్య సదుపాయం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రేమ సమాజం ఉపాధ్యక్షుడు కేశప్రగడ నరసింహమూర్తి, అడ్వైజర్ డాక్టర్ పి.విశ్వేశ్వరరావు, కోశాధికారి ఎంవీవీకే గుప్త, సంయుక్త కార్యదర్శులు మోహన్‌రావు, సురేష్‌కుమార్, గౌరీ ప్రసాద్, మాజీ కార్యదర్శి పి.గణపతిరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment