ముంపు గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలు
చింతూరు: పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 31 గ్రామాలకు సంబంధించి వచ్చేనెల 1, 3 తేదీల్లో ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభలు నిర్వహించనున్నట్లు పోలవరం స్పెషల్ కలెక్టర్ సరళవందనం శుక్రవారం తెలిపారు. పరిహారం, పునరావాసం కల్పించడంలో భాగంగా గ్రామసభలు నిర్వహించి, ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తామని ఆమె తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తొలిదశలో చింతూరు డివిజన్లో 52 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇప్పటికే 20 గ్రామాలకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 32 గ్రామాల్లో కూనవరం మండలం లేళ్లవాయిలో ప్రస్తుతం ఎవరూ నివసించకపోవడంతో ఆ గ్రామాన్ని మినహాయించి మిగిలిన 31 గ్రామాల్లో సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ గ్రామాలకు సంబంధించి ఇళ్ల నష్ట పరిహారం నిమిత్తం సామాజిక, ఆర్థిక సర్వే పూర్తికాగా అవార్డు నోటీసులు సైతం అందజేశారు.
సభలు నిర్వహించే గ్రామాలివే
చింతూరు మండలంలో ఉలుమూరు, చింతూరు, మా ర్కండేయులుపేట, చూటూరు, ఏజీకొడేరు, మల్లె తోటల్లో సభలు నిర్వహిస్తారు. వీఆర్‌పురం మండలంలో అడవి వెంకన్నగూడెం, కన్నాయిగూడెం, రాజుపేట, రాజుపేట కాలనీ, వడ్డిగూడెం, ధర్మతాళ్లగూడెం, వీఆర్‌పురం, చొప్పల్లిలలో, కూనవరం మండలంలో వాల్పర్డ్‌పేట, కూళ్లపాడు, టేకుబాక, కూనవరం, టేకులబోరు, పెదార్కూరు, పండ్రాజుపల్లి, శబరికొత్తగూడెం, కొండ్రాజుపేట గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment