విడుదల కాని ఉన్నతాధికారుల జాబితా
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్(వీఆర్‌ఎస్) జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. కార్మికులు, కనిష్ట స్థాయి అధికారుల జాబితా విడుదలైనప్పటికీ ఈ5, ఆ పైస్థాయి అధికారుల జాబితాపై సస్పెన్స్ అలానే ఉంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జారీ చేసిన వీఆర్‌ఎస్ స్కీమ్‌లో బుధవారం నుంచి అమలు చర్యలు ప్రారంభించారు. మొదటి విడతగా నాన్ వర్క్స్‌కు చెందిన కార్మికులు, ఈ4 స్థాయి వరకు అధికారుల జాబితా విడుదల చేశారు. గురువారం వర్క్స్‌కు చెందిన కార్మికులు, ఈ4 స్థాయి వరకు అధికారులతో కూడిన 826 మంది జాబితా వెల్లడించారు. వారికి ఈపీఎస్‌ఎస్ పోర్టల్‌లో వీఆర్‌ఎస్ ఆమోదం పొందినట్లు పేర్కొన్నారు. ఆయా హెచ్‌ఆర్ జోనల్ కార్యాలయాల్లో అధికారిక పత్రాలు అందించారు. అయితే ఈ5, ఆ పైస్థాయి అధికారులకు చెందిన నాన్ వర్క్స్, వర్క్స్ జాబితాలు ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఉన్నత యాజమాన్యం పరిధిలో ఉండే ఆ జాబితాకు ఆమోదం లభించక పోవడం వల్లే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వీఆర్‌ఎస్ స్కీమ్ నిబంధనలకు విరుద్ధంగా అమోదం పొందిన కొంత మందిని ఉన్నత యాజమాన్యం గుర్తించి, వారిని పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే తిరస్కరణకు గురైన వారికి ఈ నెల 22 వరకు అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment