ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలి
పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్
చింతపల్లి: స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో ఇటీవల జరిగిన నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, బాధ్యుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేయాలని, వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. బుధవారం చింతపల్లి వచ్చిన ఆయన జెడ్పీటీసీ బాలయ్య, వైఎస్సార్‌సీపీ సీనియర్‌నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. సీహెచ్‌సీగా ఉన్న చింతపల్లి ఆస్పత్రిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేశారని, కొత్త ఆస్పత్రి భవనానికి సుమారు రూ.23కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈఆస్పత్రిలో గతంలో పనిచేసిన సూపరింటెండెంట్లు అక్రమాలకు పాల్పడి, నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు. తమ ఫిర్యాదు మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆబాధ్యతలనుంచి తప్పించారని చెప్పారు. దీంతోనే అధికారులు సరిపెట్టకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఆస్పత్రి అభివృద్ధి సలహా మండలి నియామకాలు జరుగుతాయన్నారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులకు కృష్ణారావు, గంగన్న పడాల్, ఈశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment