గిరిజన ఉత్పత్తుల సేకరణపై ప్రత్యేక దృష్టి
పాడేరు: గిరిజన ఉత్పత్తుల సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్‌లో జీసీసీ అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీసీసీ కార్యకలాపాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీలోగా అంగన్‌వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న పాఠశాలలకు నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేయాలన్నారు. కాఫీ సేకరణ లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. గిరిజన రైతులకు జీసీసీ ద్వారా అందిస్తున్న రుణాల రికవరీపై ఆరా తీశారు. జీసీసీ డీఎంలు ప్రతి డీఆర్ డిపోను విధిగా తనిఖీ చేయాలని సూచించారు.జీసీసీ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా నిర్ధేశించిన సమయానికి లబ్ధిదారులకు రేషన్ సరకుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, జీసీసీ డీఎంలు డుప్పా సింహాచలం, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ
Comments
Please login to add a commentAdd a comment