రోడ్డు విస్తరణలో మోదమ్మ ఆలయాన్ని మినహాయించాలి
● సబ్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విజ్ఞప్తి
సాక్షి,పాడేరు: జాతీయ రహదారి విస్తరణలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయానికి మినహాయింపు ఇవ్వాలని ఆలయ కమిటీ చైర్మన్,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధికారులను కోరారు.పాడేరు సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,జాతీయ రహదారి అధికారులు శనివారం మోదకొండమ్మ ఆలయానికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, ఆలయ కమిటీ సభ్యులు వారిని కలిశారు. మోదకొండమ్మతల్లి ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సబ్‌కలెక్టర్‌కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈమేరకు సబ్‌కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటి బాబునాయుడు, సభ్యులు ఉడా త్రినాథ్, చల్లా రామకృష్ణ, డి.పి.రాంబాబు,లకే రత్నాబాయి,రమణ,హరి,సతీష్ పాల్గొన్నారు.
ఈ–శ్రమ్‌తో అసంఘటిత కార్మికులకు భద్రత
పాడేరు : అసంఘటిత రంగ కార్మికులు తప్పనిసరిగా ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని, తద్వార సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలు పొందవచ్చునని జిల్లా కార్మిక శాఖ అధికారి టి.సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–శ్రమ్‌లో నమోదు చేసుకున్నవారికి 12 అంకెల గుర్తింపు(యూఏఎన్) యూనివర్సల్ అకౌంట్ నంబర్ లభిస్తుందన్నారు. ఈ కార్డుతో ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ముఖ్యంగా కార్మికులకు బీమా పథకం వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2లక్షలు, పూర్తి అంగ వైకల్యం చెందిందే రూ.2 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం కలిగితే రూ.లక్ష బీమా సదుపాయం పొందవచ్చన్నారు. జిల్లాలో ఉన్న అసంఘటిత కార్మికులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment