తగ్గిన ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లా మళ్లీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన రెండు వారాలుగా స్థిరంగా ఉన్న ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. పొగమంచు భారీగా కురుస్తోంది. జి.మాడుగులలో 7.6 డిగ్రీలు, జీకే వీధిలో 7.9 డిగ్రీలు, చింతపల్లిలో 8.5 డిగ్రీలు, అరుకులోయలో 8.6 డిగ్రీలు,హుకుంపేటలో 9.3 డిగ్రీలు, పాడేరులో 9.6 డిగ్రీలు,పెదబయలులో 9.6 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.8 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 11.0 డిగ్రీలు, కొయ్యూరులో 13.2 డిగ్రీలు, అనంతగిరిలో 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
భూగర్భ జలాలను పెంచడంఅందరి బాధ్యత
ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం
వై.రామవరం(అడ్డతీగల) : భూగర్భ జలాలను పెంపొందించడం అందరి బాధ్యతని ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర పథకంలో భాగంగా వై.రామవరం మండలం ఎర్రంరెడ్డిపాలెంలో శనివారం ఇంకుడు గుంతల ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంత ను ప్రతి ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవాలన్నారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుందని చెప్పారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందామనుకునే వారు ఉపాధిహామీ అధికారులకు దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకుంటామని గిరిజనులతో ప్రతి జ్ఞ చేయించారు.ఉపాధిహామీ ఏపీడీ జి.శ్రీనివాస్,ఎంపీడీవో రవికిశోర్,ఉపాధిహామీ ఏపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment