పర్యాటక ప్రాంతాలు కిటకిట
జిల్లాలో పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రకృతి అందాలనుతిలకించేందుకు భారీగా టూరిస్టులు తరలిరావడంతో సందర్శిత ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. లంబసింగి,తాజంగి జలాశయం,చెరువులవేనం వ్యూపాయింట్, కొత్తపల్లి, పిట్టలబొర్ర జలపాతాలు.. తదితర ప్రాంతాలకు ఆదివారం భారీగాసందర్శకులు తరలివచ్చారు.
చింతపల్లి: ఆంధ్రాకాశ్మీరు లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. మైదాన ప్రాంతాల నుంచి కుటుంబాలతో ఇక్కడికి వచ్చి ప్రకృతి అదాలతో పాటు మంచు సోయగాలను ఆస్వాదించారు. పర్యాటకుల రద్దీతో లంబసింగి, తాజంగి జలాశయం వద్ద ఉదయం నుంచి సందడి వాతావరణం ఏర్పడింది. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పాల సముద్రాన్ని తలపించే మంచు అందాలకు పరశించిన సందర్శకులు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు.
పెదబయలు: మండలంలో గిన్నెలకోట పంచాయతీ పిట్టలబొర్ర జలపాతాన్ని ఆదివారం భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను కట్టి పడేసింది. జలపాతం దగ్గర వరకు వాహనాలు వెళుతుండడంతో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల్లో పలు ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు.
జి.మాడుగుల: పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన పర్యాటకులు కొత్తపల్లి జలపాతం వద్ద సందడి చేశారు. పెద్దపెద్ద బండరాళ్లపై నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహంలో స్నానాలు చేశారు. వ్యూ పాయింట్ వద్ద ఫొటోలు,సెల్ఫీలు దిగారు. రోజంతా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.
థింసా కళాకారులను ఆదుకోవాలి
డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం వద్ద సందర్శకులను అలరిస్తున్న థింసా కళాకారులను అధికారులు ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. ఆదివారం ఆయన చాపరాయి జలపాతాన్ని సందర్శించి, అక్కడి థింసా నృత్య కళాకారులతో మాట్లాడారు. ఐటీడీఏ నుంచి అందించే ప్రోత్సాహం కోసం ఆరా తీశారు. చాపరాయి జలపాతానికి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని థింసా నృత్య కళాకారులకు కేటాయించాలని అధికారులను కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కూడా సుభ్రమణ్యం పాల్గొన్నారు.
పర్యాటక ప్రాంతాలు కిటకిట
పర్యాటక ప్రాంతాలు కిటకిట
పర్యాటక ప్రాంతాలు కిటకిట
Comments
Please login to add a commentAdd a comment