విద్యార్థినిపై టెన్త్ విద్యార్థినుల దాడి
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థినిపై అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు జనవరి 5న దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బంధించారు. ఈ వీడియో ఈ నెల 16న వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. దీంతో విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదివారం సాయంత్రం స్థానిక సెయింటాన్స్ పాఠశాల వసతి గృహాన్ని సందర్శించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థినులతో మాట్లాడి, సంఘటన గురించి ఆరా తీశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెయింటాన్స్ పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని, తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉందన్నారు. విద్యార్థినులపై యాజమాన్యం పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునారావృతం కాకుండా చూడాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఎంఈవో విశ్వప్రసాద్ వసతి గృహాన్ని సందర్శించారు. పాఠశాల యాజమాన్యం, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని మీడియాకు ఆయన తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి వైరల్‌గా మారిన వీడియోలో టెన్త్ విద్యా ర్థినుల్లో కొందరు సిగరెట్ తాగిన వ్యవహారంపై 7వ తగరతి విద్యార్థినిని ప్రశ్నిస్తూ దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
పాడేరు సెయింటాన్స్ పాఠశాలలో ఘటన
7వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు దాడి
తాము చేసిన తప్పుల్ని వేరే
విద్యార్థినులకు చెబుతోందని ఆరోపణ
పాఠశాలను సందర్శించినఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
సంఘటనపై సమగ్ర విచారణజరిపించాలని డిమాండ్
విద్యార్థినిపై టెన్త్ విద్యార్థినుల దాడి
Comments
Please login to add a commentAdd a comment