త్వరితగతిన తాజంగి మ్యూజియం నిర్మాణం
చింతపల్లి: తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం చింతపల్లి మండలం తాజంగి, లంబసింగిలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణంలో జాప్యం కారణంగా పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను ప్రభుత్వం తొలగించిందన్నారు. మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున టెండర్ల ప్రక్రియకు అవరోధం కలిగిందని, కోడ్ ముగియగానే టెండర్లను పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. ఈ పనులన్నీ ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు నెలనాటికి పూర్తి కావాలని జేసీ, ఇన్‌చార్జి ఐటీడీఏ పీఓ అభిషేక్ గౌడను ఆదేశించారు. ఇప్పటి వరకూ చేపట్టిన నిర్మాణాలు, చేపట్టాల్సిన పనులను గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్ వివరించారు. ఈఈ డేవిడ్‌రాజ్, డీఈలు రఘు, వంశీకృష్ణ, ఏఈఈ యాదకిశోర్ పాల్గొన్నారు.
కాఫీతోటల పరిశీలన
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నాయక్ లంబసింగి పంచాయతీ మారుమూల ఉన్న గాదిగొయ్యి గ్రామంలో కాఫీ తోటలను పరిశీలించారు. కాఫీలో అంతరపంటగా సాగు చేస్తున్న మిరియాల వల్ల గిరిజనులకు సమకూరుతున్న ఆదాయం గురించి తెలుసుకున్నారు. తమకు నిచ్చెనలు, టార్పాలిన్లు పంపిణీ చేయాలని గిరిజనులు కోరారు. కాఫీ ఏడీ అప్పలనాయుడు, ఏఈవో ధర్మారాయ్ పాల్గొన్నారు.
టెండర్లు పూర్తిచేసి పనులు
వేగవంతం చేయాలి
గిరిజన సంక్షేమశాఖ
ప్రిన్సిపల్ కార్యదర్శి నాయక్
Comments
Please login to add a commentAdd a comment