ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ జనరల్ విద్యార్థులకు 26 పరీక్ష కేంద్రాలు,ఒకేషనల్ విద్యార్థులకు ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.అన్ని కేంద్రాల వద్ద,గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘానీడలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులు ఉదయం 8గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మహిళా పోలీసులు,ఇతర సిబ్బంది తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను రూమ్‌ల్లోకి పంపారు. ఇంటర్ జనరల్ విద్యార్థులు 5,454 మందికి గాను 5,310 మంది పరీక్ష రాయగా, 144 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు 1,215మందికి గాను 1,135మంది పరీక్ష రాయగా 80మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు నడిపారు.
తొలిరోజు ప్రశాంతం జనరల్ విద్యార్థులు 144 మంది,
ఒకేషనల్ విద్యార్థులు 80 మంది గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment