జీపుబోల్తా.. ఒకరి మృతి
● బ్రేకులు ఫెయిలై ప్రమాదం ● డీజిల్ లీకై మంటలు వ్యాపించి దగ్ధం
గూడెంకొత్తవీఽధి: మండలంలోని ఎర్రగెడ్డ సాగులు ఘా ట్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఎర్రగెడ్డనుంచి ప్రయాణికులతో ఆర్వీనగర్ వారపు సంతకు వస్తున్న జీపు బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పి బోల్తాపడింది. దీనికి తోడు డీజిల్ లీకై పెద్దఎత్తున మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ఘటనలో జీపులో ప్రయాణిస్తున్న వారిలో ఎర్రగెడ్డ గ్రామానికి చెందిన మర్రి వెంకటరావు(60) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. కొర్రా పిడుగో అనే గిరిజనుడి కాళ్లు విరిగిపోగా, డ్రైవర్‌తో సహా మరో ఆరుగురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో గూడెంకొత్తవీధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి పంపా రు. వెంకటరావు మృతదేహాన్ని పోస్టుమార్టానికి చింతపల్లి ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్‌ఐ అప్పలసూరి తెలిపారు.
జీపుబోల్తా.. ఒకరి మృతి
Comments
Please login to add a commentAdd a comment