బ్యాలెట్ బాక్సులుస్ట్రాంగ్ రూమ్‌లో భద్రం
సాక్షి, పాడేరు: పాడేరు డివిజన్‌లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక భద్రతతో గురువారం రాత్రికి పాడేరు రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు. చింతపల్లి, కొయ్యూరు, అనంతగిరి, ముంచంగిపుట్టులోని నాలుగు రూట్లకు సంబంధించి 4 ఆర్టీసీ బస్సుల ద్వారా ఎన్నికల సిబ్బంది పాడేరు చేరుకున్నారు. తమ పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులకు అప్పగించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మలతల సమక్షంలో అన్ని బ్యాలెట్ బాక్సులను ఇక్కడ తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు.
బ్యాలెట్ బాక్సులుస్ట్రాంగ్ రూమ్‌లో భద్రం
Comments
Please login to add a commentAdd a comment