కోడ్ ఉల్లంఘన
● పసుపు కుర్చీలతో కూటమి నాయకుల ప్రచారం
డుంబ్రిగుడ: ఒకపక్క పోలింగ్ జరుగుతుండగా.. బయట శిబిరం ఏర్పాటు చేసి కూటమి నాయకులు యథేచ్ఛగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండగా.. ఉదయం 9 గంటలకు టీడీపీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో పసుపు రంగు కుర్చీలతో టెంటును ఏర్పాటు చేశారు. పార్టీ అరకులోయ ఇన్‌చార్జి, విజయనగరం జిల్లా ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సియారి దొన్నుదొర శిబిరంలో చేరి ఏపీటీఎఫ్, కూటమి అభ్యర్థి పి.రఘువర్మ తరపున ప్రచారం చేశారు. పీఆర్‌టీయూ, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘల నాయకులు వారి తీరుపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment