విశాఖ లీగల్: గంజాయి కలిగి ఉన్న వ్యక్తికి 10 ఏళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయిలు జరిమానా విధిస్తూ నగరంలోని ప్రధాన మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి ఎం.వెంకటరమణ గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు.
ప్రథమ శ్రేణి ప్రత్యేక పబ్లిక్ ప్యాసిక్యూటర్ బి.ఎస్.ఎస్.ప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు గజ్జి సత్తిబాబు(40) అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడి గుమ్మల పంచాయతీ పోలవరం గ్రామ నివాసి, వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. 2014 నవంబర్ 22వ తేదీన ముందస్తు సమాచారం మేరకు గొలుగొండ తహసీల్దార్, గొలుగొండ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా పాకలపాడు గ్రామం నుంచి చీడి గుమ్మల వైపు వస్తున్న ట్రాక్టర్‌లో 183 కేజీల గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్నట్లు గుర్తించారు. అప్పటి ఎస్‌ఐ ఎన్.జోగారావు నిందితుడిపై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment