చీడికాడ : పశుసంవర్దకశాఖ , బోవైన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 14 న ఉత్తరాంధ్ర పాడి పశువుల పాల పోటీలు నిర్వహిస్తున్నట్టు పాడేరు డివిజన్ పశుసంవర్ధక శాఖ సంచాలకుడు సి.హెచ్. నర్సింహులు పేర్కొన్నారు. మండలంలో కొత్తపల్లి, అడవిల అగ్రహారం, వింటిపాలెంలో పర్యటించారు. అధిక దిగుబడినిచ్చే పశువులను గుర్తించి, పాడి రైతులు పాల పోటీల్లో పాల్గోవాలని సూచించా రు. విజయనగరం జిల్లా తోటపాలెంలో ఈ పోటీలు నిర్వహిస్తామని, పాడి రైతులు తమ వద్ద వున్న రోజుకు 20 లీటర్లు పాలిచ్చే హెచ్‌యఫ్ ఆవులు, రోజుకు 16 లీటర్లు పాలు ఇచ్చే జెర్సీ ఆవు, రెండు లీటర్లు పాలు ఇచ్చే ఒంగోలు, 8 లీటర్లు పాలిచ్చే గేదెలును ఈ పోటీలకు తీసుకుని రావచ్చునని తెలిపారు. మాడుగుల ఏరియా పశువైద్య సహాయ సంచాలకుడు చిట్టినాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment