రాజీపడదగ్గ కేసుల్నిపరిష్కరించండి
అల్లిపురం(విశాఖ): మోటారు ప్రమాద నష్టపరిహార కేసులు, చెక్ బౌన్సు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల్ని మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వెంకట శేషమ్మ అధ్వర్యంలో గురువారం జిల్లాకోర్టులో జరిగిన సమావేశంలో ఆయన ఈ కేసులపై సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో వున్న కేసులు, ఎన్‌బీడబ్ల్యూ పెండింగ్ కేసులపై తగు చర్యలు తీసుకోవాలని, జాతీయ లోక్ అదాలత్‌లో వీటిని పరిష్కరించవచ్చన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఎక్కువగా దృష్టిసారించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లవారీగా, కోర్టుల వారీగా లోక్ అదాలత్‌కు ఎన్ని కేసులు పంపించారో అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రజా న్యాయపీఠం న్యాయమూర్తి వల్లభనాయుడు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకటరమణ, రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్‌లు, పోలీసు అధికారులు, బీమా, చిట్ ఫండ్ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకు ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment