ఉత్తరాంధ్రలో ఉన్నత విద్యారంగానికి కేంద్రం ఆంధ్ర యూనివర్సిటీ. అటువంటి కీలకమైన యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో ఒక్కపైసా అదనపు కేటాయింపులు కనిపించలేదు. గత ఏడాది బడ్జెట్ తరహాలోనే ఈ ఏడాది కూడా రూ. 389.34 కోట్లను మాత్రమే కేటాయించారు. విశాఖలోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్‌స్టిట్యూట్‌కు కేవలం రూ.27.91 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 59.48 కోట్ల మేర కేటాయించగా... ప్రస్తుత బడ్జెట్‌లో సగానికిపైగా కేటాయింపులు తగ్గించారు. మరోవైపు పాడేరు, నర్సీపట్నం మెడికల్ కాలేజీల అభివృద్ధి ప్రస్తావన కూడా చేయకపోవడం గమనార్హం. పాడేరు మెడికల్ కాలేజీతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజీల గురించి కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment