మెడికల్ కళాశాలకు పైసా విదల్చకపోవడం అన్యాయం
జిల్లా వాసులకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. సగానికి పైగా పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు మందగించాయి. ఈసారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాడేరు మెడికల్ కళాశాల అభివృద్ధి కోసం, సౌకర్యాల కల్పన కోసం పైసా కూడా కేటాయించకపోవడం సరికాదు. కేవలం గిరిజనులపై ఉన్న వివక్ష కారణంగానే నిధులు కేటాయించలేదు.
– కూడా సుబ్రమణ్యం, గిరిజన నేత, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment