రేషన్‌డిపోల వారీగా ఆడిట్‌కు ఆదేశాలు
అడ్డతీగల: ఖాళీ కందిపప్పు కవర్ల వ్యవహారం నిగ్గుతేల్చే పనిలో అధికారులు పడ్డారు.ఈ మేరకు అడ్డతీగల జీసీసీ బ్రాంచి పరిధిలోని 32 రేషన్‌డిపోల వారీగా ఆడిట్ నిర్వహించి మార్చి 10వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీ ఆదేశాలు జారీ చేశారు.‘కవర్లు ఇక్కడ–కందిపప్పు ఎక్కడ’ అనే శీర్షికన ఫిబ్రవరి 17 న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు స్పందించిన అధికార యంత్రాంగం కంది పప్పు ఏమైందో తెలుసుకునే చర్యలు చేపట్టారు. రేషన్‌కార్డుదారుల అభిప్రాయాలతో నివేదిక రూపొందించాలని ఆదేశించారు. దీనిలో భాగంగా జీసీసీ బ్రాంచి మేనేజర్,అడ్డతీగల డిప్యూటీ తహసీల్దార్, స్థానిక వీఆర్వోలు డిపోల వారీగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకూ వచ్చిన కందిపప్పు,వినియోగదారులకు పంపిణీ చేసినవి,మిగిలిన నిల్వలు వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు. డిపోలతోపాటు మండల స్టాక్ పాయింట్ గోడౌన్ రికార్డులను పరిశీలించనున్నారు. అడ్డతీగల మండలంలో 14 రేషన్‌డిపోలు,వై.రామవరం లోయర్‌పార్ట్‌లో ఆరు డిపోలు,గంగవరం మండలంలో 12 రేషన్‌డిపోల్లో ఆడిట్ జరగనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల సంగతి తెలిసిన మండల లెవిల్ స్టాక్ పాయింట్ సిబ్బంది,రేషన్‌డిపోల డీలర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రికార్డుల్లో లెక్కలు సరిచేసుకోవడానికి తలలు పట్టుకుంటున్నారు.ఈ అంశాలపై అడ్డతీగల జీసీసీ ఇన్‌చార్జ్ బ్రాంచి మేనేజర్ విజయలక్ష్మి వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
‘కవర్లు ఇక్కడ–కందిపప్పు ఎక్కడ’ కథనంపై సమగ్ర దర్యాప్తు
త్రీమెన్ కమిటీ నియామకం
మార్చి 10 లోగా నివేదిక సమర్పించాలి
సబ్‌కలెక్టర్ కల్పశ్రీ ఉత్తర్వులు
రేషన్‌డిపోల వారీగా ఆడిట్‌కు ఆదేశాలు
రేషన్‌డిపోల వారీగా ఆడిట్‌కు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment