● విశాఖతో సహా 25 ప్రాంతాల్లోపరీక్ష కేంద్రాలు
సాక్షి,పాడేరు: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న బాలబాలికలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు గురుకుల విద్యాలయాల కో–ఆర్డినేటర్ పి.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు.శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను 6,239 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.ప్రతి పాఠశాలలో 30 మంది బాలురు,30 మంది బాలికలకు 6వ తరగతిలో సీట్లు ఉంటాయన్నారు. ఈసీట్ల భర్తీకి గాను ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. విశాఖలోని మారికవలస బాలుర గురుకుల పాఠశాలతో పాటు చింతపల్లి, పాడేరు, కొయ్యూరు, జీకే వీధి,అరకులోయ, రంపచోడవరం,చింతూరు,రాజవొమ్మంగి,అడ్డతీగల మండలాల్లోని పలు పాఠశాలల్లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఆదివారం 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందని,ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన బాలిబాలికలను తల్లిదండ్రులు నిర్ణీత సమయానికి సంబంధిత పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment