ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
సాక్షి,పాడేరు: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు జిల్లాలో శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8గంటల నుంచే విద్యార్థులు పాడేరుతో పాటు జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలకు తరలివచ్చారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది. పాడేరులోని ఏపీఆర్ కళాశాల,కేజీబీవీ విద్యార్థినులను బస్సుల్లో పరీక్ష కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలోని 26 కేంద్రాల్లో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు పరీక్షకు 1,301మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,093మంది హాజరుకాగా, 208 మంది గైర్హాజరయ్యారు.ఇంటర్ జనరల్‌కు సంబంధించి 6,350 మందికి గాను 5,892 మంది హాజరుకాగా, 458 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,తలారిసింగి ఏపీఆర్ సెంటర్‌లోను పరీక్షలు సజావుగా జరిగాయి.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు వీఆర్వోలు, మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. సెల్‌ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా ప్రవేశ ద్వారాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బెంచీలు,విద్యుత్,తాగునీటి సౌకర్యాలు కల్పించారు. వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచారు.
26 కేంద్రాల్లో పరీక్షలు
ఒకేషనల్‌కు 208 మంది,
జనరల్‌కు 458 మంది గైర్హాజరు
20 నిమిషాలు ఆలస్యంగా ..
ముంచంగిపుట్టు: స్థానిక ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రంలో నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.శనివారం ఉదయం 9గంటలకు పరీక్ష ప్రారంభం కావలసి ఉండగా 20 నిమిషాలు ఆలస్యంగా పేపర్‌ను విద్యార్థులకు అందజేశారు. పాడేరు డీఎస్పీ షాబాజ్ అహ్మద్ మధ్యాహ్నం 12.05 గంటలకు పరీక్ష కేంద్రం వైపు వెళ్లగా అప్పటికీ విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. సమయం దాటిపోయినా ఎలా అనుమతించారని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు.దీంతో 12.10 గంటలకు నిర్వాహకులు విద్యార్థుల నుంచి పేపర్లు తీసుకున్నారు. నిర్వాహకుల తీరుపై డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమయం ప్రకారం పరీక్షలు నిర్వహించాలని,విద్యార్థులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించారు.పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులతో మాట్లాడి,నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జి.మాడుగుల సీఐ శ్రీనివాసు ఉన్నారు. ఈ కేంద్రంలో 281 మంది విద్యార్థులకు గాను 14 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేదు.267 మంది పరీక్షలు రాసారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment