బడ్జెట్‌లో పేదలకు అన్యాయం
సాక్షి,పాడేరు: ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో పేదలకు అన్యాయం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ బడ్జెట్ రూపకల్పనలో కనీసం సూపర్‌సిక్స్ హామీలను కూడా కూట మి ప్రభుత్వం న్యాయం చేయకపోవడం దారుణమని చెప్పారు.రాష్ట్రంలో అమ్మకు వందనం పొందేందుకు 97లక్షల మంది విద్యార్థులు అర్హులని, రూ.12,630కోట్లు అవసరం కాగా,బడ్జెట్‌లో కేవలం 8,278 కోట్లు కేటాయింపులు జరపడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రతి కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా రూ.15వేల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించిన కూటమి నేతలు ఇప్పుడు చాలీచాలని నిధులు కేటాయించి కొంతమందికే అమలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.అన్నదాత సుఖీభవకు కూడా కేటాయింపులు తక్కువుగానే ఉన్నాయన్నారు.రూ.10,700కోట్ల నిధులు అవసరం కాగా,ఈ బడ్జెట్‌లో 6,300కోట్లు కేటాయించడం అన్యాయమని తెలిపారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన ప్రాంతాల్లో రైతులంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి,ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన హామీని కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి తీవ్ర అన్యాయం చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
2.48 శాతం మాత్రమే కేటాయింపులు
పాడేరు: బడ్జెట్‌లో ఆదివాసీలకు తీవ్రఅన్యాయం చేశా రని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దామాషా పద్ధతి ప్రకారం 5.53 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేవలం 2.48 శాతం మాత్రమే కేటాయింపులు చేసి వివక్ష చూపించారని పేర్కొన్నారు. ఆదివాసీల కోసం ఎనిమిది ఐటీడీఏల ద్వారా పాలన జరుగుతోందని, కానీ కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల కోసం రూ.18వేల కోట్లు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.1,424 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఏ విధంగా వారి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. గిరిజనాభివృద్ధి, సంక్షేమం కోసం అదనంగా రూ.10వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్
రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment