లక్ష్య సాధనకుకఠోర శ్రమ అవసరం
● ఎస్పీ అమిత్ బర్దర్
పాడేరు : నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు కఠోర శ్రమ అవసరమని, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో చదితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన సందర్శించి, టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ అభిరుచులను బట్టి లక్ష్యాలను నిర్దేశించుకుని, ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. ఉన్నత ఉద్యోగాల్లో, ఉన్నత రంగాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, గిరిజన ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. ప్రభుత్వాలు అందజేస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఈనెల 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నందున విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ధీరజ్, పాడేరు సీఐ దీనబంధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment