పాడేరు : గబ్బంగి పంచాయతీ పనసపల్లి గ్రామంలో మూగజీవాలు అనారోగ్యం బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో సుమారు ఎనిమిది దుక్కిటెద్దులు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గొల్లోరి కృష్ణబాబుకు చెందిన ఒక దుక్కిటెద్దు, అల్లూరి చిట్టిబాబాబుకు చెందిన ఒక దుక్కిటెద్దు, చిన్నారావుకు చెందిన మూడు దుక్కిటెద్దులు, పాంగి మత్య్సరాజుకు చెందిన ఒక దుక్కిటెద్దు, గొల్లోరి లక్ష్మయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ నురగలు కక్కుతూ మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు నష్ట పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు. గ్రామంలో పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి, పశువులకు వైద్య పరీక్షలు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment