3, 4 తేదీల్లో గంగమ్మతల్లి పండగ
ముంచంగిపుట్టు: మండలంలోని పాత, కొత్త సుజనకోట గ్రామాల్లో గంగమ్మ తల్లి పండగ ఈ నెల 3,4 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో బుడియాలు ప్రచారం చేశారు. ఈ పండగ సందర్భంగా మండలంలో అధిక సంఖ్యలో గిరిజనులు బుడియా మాల ధరించి కర్రలు పట్టుకొని విన్యాసాలు చేస్తూ పాటలు పడుతూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సుజనకోట సర్పంచ్ వి.రమేష్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నేతలు శంకర్‌రావు, నీలకంఠం, బలరాం, తిరుపతిరావు, రుక్మంధర్, గాసిరావు, దామోదరం, సదానందం, రామమూర్తి, నానిబాబు, రాధాకృష్ణ, ధర్మారావు పాల్గొన్నారు.
గంగమ్మతల్లీ పాకెట్ క్యాలెండర్ ఆవిష్కరణ
పాత సుజనకోట గ్రామంలోని గంగమ్మతల్లీ పండగను పురస్కరించుకుని అమ్మవారి పేరిట పాకెట్ క్యాలెండర్‌ను శనివారం సుజనకోట సర్పంచ్ వి.రమేష్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన వైజాగ్ హిందుస్థాన్ షిప్‌యార్డు ఉద్యోగి, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సమరెడ్డి బాలగంగాధర్ తిలక్ ప్రతి ఏడాది అమ్మవారి పేరిట పాకెట్ క్యాలెండర్‌ను ముద్రించి పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా క్యాలెండర్ల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment