పశువులకు వ్యాధి నిరోధిక టీకాలు తప్పనిసరి
గంగవరం: పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయాలని పశుసంవర్థక శాఖ రంపచోడవరం ఉప సంచాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ సూచించారు. గంగవరం మండలంలో గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 31 వరకూ టీకాల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పశు వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కుసుమరాయి గ్రామంలో గోశాల షెడ్లను పరిశీలించారు. పాడి రైతులు పశుసంవర్థక శాఖ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు. నెల్లిపూడి గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ అధికారి అప్పన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment