మద్దిలపాలెం: మానవ జీవితం సజావుగా సాగేందుకు సాధన ఎంతో అవసరమని పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ప్రవచించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సాధన రహస్యం అంశం మీద స్వామి వారి ప్రవచన కార్యక్రమం రెండో రోజు ఆదివారం ఆధ్యాత్మిక భావంతో సాగింది. స్వామీజీ మాట్లాడుతూ మనిషి జీవితం వివిధ తాపత్రయాలతో ముడిపడి ఉంటుందని, వాటికి తాత్కాలిక ఉపశమనం, శాశ్వత పరిష్కారం రెండు విధాలుగా లభిస్తుందని వివరించారు. ఉపశమనాల నుంచి పరిష్కారం దిశగా మారేందుకు ఆధ్యాత్మిక శక్తి మాత్రమే తోడ్పడగలదని చెప్పారు. వాహనాలు నడవడానికి ఇంధనం ఎంత అవసరమో.. జీవితం సజావుగా సాగేందుకు సాధన అంతే అవసరమని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎన్ రాజు, డాక్టర్ రాంబాబు, డాక్టర్ చిట్టిపంతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment