38 మంది బైక్ రేసర్ల అరెస్ట్
● 38 బైక్‌లు సీజ్ చేసిన పోలీసులు
బీచ్‌రోడ్డు: నగరంలో అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహించిన యువకులను పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లతో పాదచారుల్ని, వాహనదారుల్ని ఇబ్బంది పెడుతుండటంపై స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, 38 మంది బైక్ రేసర్లను అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ విభాగం ఏడీసీపీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బీచ్‌రోడ్‌తో సహా, నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రేసింగ్‌ల పేరిట, ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ పాదచారులు, వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. జోన్–1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో త్రీటౌన్, ద్వారక, నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, 38 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి, 38 బైక్‌లను సీజ్ చేశామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment