ఇటీవలే ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను ఆర్‌కేఈసీ ప్రాజెక్టు లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. రూ.32,61,42,763తో రెండు ఫిషింగ్ జెట్టీల నిర్మాణంతో పాటు వార్ఫ్ కూడా నిర్మించేలా టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం ఉన్న ఫింగర్ జెట్టీల మధ్యలో అంటే.. నాలుగో నంబరు జెట్టీ నుంచి 11వ నంబరు జెట్టీ వరకు వార్ఫ్ నిర్మాణం జరగనుంది. చేపల లోడింగ్, అన్‌లోడింగ్‌కు అనుగుణంగా ఈ వార్ఫ్ ఏర్పాటు కానుంది. అదేవిధంగా ప్రస్తుతం హార్బర్‌లో 11 ఫిషింగ్ జెట్టీలున్నాయి. 10 జెట్టీలు మత్స్యకారులు వినియోగిస్తుండగా.. చివరిదైన 11వ జెట్టీని కోస్ట్‌గార్డ్‌తో పాటు మత్స్యకారులు సంయుక్తంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ జెట్టీ పక్కన మరో రెండు నిర్మాణం కానున్నాయి. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసేలా నిబంధనలు విధిస్తూ పనుల్ని ఆర్‌కేఈసీ సంస్థకు అప్పగించారు. ఈ రెండూ అందుబాటులోకి వస్తే.. 11వ జెట్టీని పూర్తిగా కోస్ట్‌గార్డ్ వినియోగించుకుంటుంది. మత్స్యకారులు మాత్రం 12 జెట్టీలను వాడుకునే అవకాశం లభిస్తుంది.
ఫిషింగ్ హార్బర్
Comments
Please login to add a commentAdd a comment