లక్ష్యసాధనకు విద్యార్థులుకృషి చేయాలి
రంపచోడవరం: విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని సీఐఎఫ్ డైరెక్టర్ రవిశంకర్ తెలిపారు.పందరిమామిడి కేవీకేలో మత్స్యకారులు, విద్యార్థులకు వేర్వేరుగా రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పరంగా పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, గిరిజన విద్యార్థులు వాటిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం రైతులకు కోడి పిల్లలు, మేతను ఉచితంగా అందజేశారు. కేవీకే శాస్త్రవేత్తలు రాజేంద్రప్రసాద్, వీరాంజనేయులు, సీఐఎఫ్ శాస్త్రవేత్తలు డాక్టర్ మురళీధర్, శోభ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment