
వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరం
చింతూరు డీఎఫ్‌వో బబిత
చింతూరు: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని చింతూరు డీఎఫ్‌వో బబిత అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ దితనోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో ఆశాఖ ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక అటవీ కార్యాలయంలో వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై డీఎఫ్‌వో బబిత విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వన్యప్రాణులను వేటాడకుండా చూడాలని, అడవులను రక్షించడం ద్వారా పర్యావరణం కాపాడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రేంజర్లు ఆజాద్, అబ్బయదొర, డీఆర్‌వో శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌వోలు చిన్నభిక్షం, రాజమ్మ, వీరభద్రయ్య పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణకు విద్యార్థులే అంబాసిడర్లు
కూనవరం: ప్రపంచంలో కొన్ని వన్యప్రాణులు అంతరించి పోతున్నాయని, అలా అంతరించి పోకుండా పరిరక్షించాల్సిన బాధ్యతను విద్యార్థి దశ నుంచే అలవర్చుకుని, వన్యప్రాణుల సంరక్షణకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని స్థానిక రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా రేంజ్ పరిధిలోని కోతులగుట్ట ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ గురుకుల పాఠశాల, కేజీబీవీ, నరసింహాపురంలోని ఏహెచ్‌ఎస్ బాలుర పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులుఅందజేశారు. ఈకార్యక్రమంలో గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఏ హెచ్‌ఎస్ నరసింహాపురం ప్రిన్సిపాల్ వెంకటనారాయణ, డీఆర్‌వో అనిల్‌కుమార్, ఎఫ్‌ఎస్‌వోలు సాయి వెంకటరమణ, విజయలక్ష్మి, దేశాయి, శంకర్‌రెడ్డి, ప్రసన్న కుమార్, ఎఫ్‌బివోలు నాగలక్ష్మి, జంపన్నరాజు, దుర్గాభవాని, బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
వి.ఆర్.పురం: వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని సబ్ డివిజన్ ఫారెస్టు అధికారి కె.వి.ఎస్.రాఘవరావు అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా స్థానిక అటవీ శాఖాధికారులు స్థానిక కేజీబీవీ విద్యార్థులతో రేఖపల్లిలో ర్యాలీ నిర్వహించారు. వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ ఫారస్ట్ అధికారి రాఘవరావు మాట్లాడుతూ వన్యప్రాణులను సంరక్షించుకోవడంతో ప్రకృతి మనుగడ సాధ్యమవుతుందన్నారు.ఆటవీ శాఖ అధికారులు ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ ఎంతో అవసరం
Comments
Please login to add a commentAdd a comment