
కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ
సాక్షి, పాడేరు: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఉమెన్ ఎంపవర్మెంట్‌పై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్‌లు సోమ వారం సంతకాలు చేసి దీనిని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి ఆధ్వర్యంలో కుమ్మరిపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి కలెక్టర్ కార్యాలయం జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలికలు,మహిళల హక్కులు,చట్టాలపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీడీపీవో ఝాన్సీరాణి,ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవ వారోత్సవాలు

కొవ్వొత్తులతో మహిళల ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment