
కవలలు–ఒకే సారి డాక్టర్లయ్యారు
రాజవొమ్మంగి: మండలంలోని తంటికొండ గ్రామానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు ముర్ల సౌజన్య, శరణ్య ఒకే సారి ఎంబీబీఎస్ పట్టా తీసుకుని సోమవారం గ్రామానికి రావడంతో స్నేహితులు, బంధువులు వారిని అభినందనలతో ముంచెత్తారు. సౌజన్య, శరణ్య చిన్నప్పటి నుంచి కలిసే చదువుకొన్నారు. నీట్‌లో ర్యాంకు పొందడంతో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీట్లు వచ్చాయి. వీరి ఐదేళ్ల చదువు పూర్తి కావడంతో ఈనెల 2న రంగరాయ మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లు పొందారు. దీంతో తల్లిదండ్రులు రాము, సత్యవతిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మండలంలోని పలువురు ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను అభినందించారు. కాగా పిల్లల తండ్రి రాము కాకినాడలో రవాణాశాఖలో పని చేస్తున్నారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన గిరిజన యువతి
కొయ్యూరు: నడింపాలెంకు చెందిన గిరిజన యువతి సుమర్ల మహేశ్వరి మానస కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల నుంచి సోమవారం ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. చిన్నతనంలోనే మానస తండ్రిని కోల్పోయింది.తల్లి సరస్వతి పట్టుదలతో మానసను చదివించారు. టెన్త్ వరకు భీమునిపట్నంలో చదివిన మానస ఇంటర్మీడియెట్ రాజమండ్రిలో పూర్తి చేశారు.నీట్‌తో ర్యాంకు రావడంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించింది. ఆమె తల్లి సరస్వతి మాట్లాడుతూ తన కుమార్తె ఎంబీబీఎస్ పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు.

కవలలు–ఒకే సారి డాక్టర్లయ్యారు
Comments
Please login to add a commentAdd a comment