● అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ● కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: దీపం–2 పథకాన్ని జిల్లాలో సమర్థంగా అమలుజేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన జేసీ, ఐటీడీఏ పీవోలు,సబ్‌కలెక్టర్‌లు,పలుశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సరఫరాదారులు అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్న 48గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని తెలిపారు. జేసీ అభిషేక్‌గౌడ మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని,అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీ పరిధిలో 15 కిలోమీటర్ల వరకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని,15 కిలోమీటర్లు దాటితే రూ.30 రవాణా చార్జీలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఉచిత గ్యాస్ నగదు 48గంటల్లో జమకాని పక్షంలో 14400 లేదా 1967 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీపం–2 పథకం కింద జిల్లాకు 11,433 గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయని,వాటిలో వినియోగంలో లేని 61కనెక్షన్‌లకు ఈకేవైసీ చేయాలన్నారు.అదనపు వసూళ్లు చేసే గ్యాస్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పాడేరు,రంపచోడవరం సబ్‌కలెక్టర్‌లు శౌర్యమన్‌పటేల్, కల్పశ్రీ, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి గణేష్,పలు గ్యాస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment