
తల్లీకూతురు సుజాత, దీక్షిత(ఫైల్)
మునగపాక: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుజాత, ఆమె కూతురు దీక్షిత కనిపించడం లేదంటూ మునగపాక పోలీసులకు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మళ్ల అప్పారావు సమీపంలోని ఎస్‌ఈజెడ్‌లో పనిచేస్తుంటాడు. అతని భార్య సుజాత అచ్యుతాపురం మండలం హరిపాలెంలో తాపీమేసీ్త్ర వద్ద కూలీగా పనిచేస్తోంది. ఎప్పటిలాగానే ఈ నెల 19న అప్పారావు తన బైక్‌పై భార్య, కుమార్తెను తీసుకువచ్చి హరిపాలెంలో దించాడు.
తిరుగు ప్రయాణంలో తీసుకెళ్లేందుకు రాగా, వారు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. ఇంతవరకూ ఆచూకీ లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆచూకీ తెలిసిన వారు 8464825574, 9391564128, 9703330403 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.