కన్నా.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. | Boy dies due to Electrocution in anakapalle | Sakshi
Sakshi News home page

కన్నా.. అప్పుడే నూరేళ్లు నిండాయా..

Published Sun, Sep 15 2024 2:56 AM | Last Updated on Sun, Sep 15 2024 11:47 AM

Boy dies due to Electrocution in anakapalle

ములకలాపల్లిలో విద్యుత్‌ షాక్‌కు గురై బాలుడి మృతి 

 ఇంట్లో ఫ్యాన్‌ ప్లగ్‌ పెడుతుండగా ప్రమాదం 

దేవరాపల్లి: అప్పటి వరకు తమ కళ్ల ఎదుట ఉన్న కుమారుడు విద్యుత్‌ ఘాతానికి గురై క్షణాల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా.. బిడ్డా అని రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మండలంలోని ములకలాపల్లిలో శనివారం సాయంత్రం విద్యుత్‌ షాక్‌ గురై పదేళ్ల బాలుడు మృతి చెందాడు. 

కుటుంబీలు, స్థానికుల కథనం మేరకు... గ్రామానికి చెందిన వడగళ్ల గణేష్‌, భవానీ దంపతులకు ఇద్దరు కుమారులు హేమంత్‌, యశ్వంత్‌ ఉన్నారు. చిన్న కుమారుడు యశ్వంత్‌ (10) ఇంట్లో ఫ్యాన్‌ కోసం ప్లగ్‌ పెడుతుండగా విద్యుత్‌ ఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు బయటకు తీసుకువచ్చి ఇసుకలో వేసి రక్షించే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అప్పటికే ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లి భవానీ గుండెలవిసేలా రోదించిన తీరు పలువురి హృదయాలను కలచి వేసింది. యశ్వంత్‌ స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement