స్పీకర్‌ని కలిసిన క్రైమ్ అడిషనల్ ఎస్పీ
స్పీకర్ అయ్యన్నపాత్రుడుని కలిసిన
జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ మోహన్‌రావు
నర్సీపట్నం : శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్.మోహన్‌రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని స్పీకర్ సూచించారు. వాహనదారులు అతివేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ వెంట క్రైమ్ సీఐ అప్పలనాయుడు, టౌన్ సీఐ గోవిందరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment