అనకాపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీచేశారు. క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పెతకంశెట్టి శివసత్యనారాయణ(జోసెఫ్), విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షునిగా బొడ్డపల్లి హేమంత్‌కుమార్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షునిగా కడిమిశెట్టి సతీష్, జిల్లా అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా బెల్లాన అనురాధ, జిల్లా ఐటీ వింగ్ విభాగం అధ్యక్షునిగా పల్లెల వెంకట సీతమ్మదొర, జిల్లా వైద్య విభాగం అధ్యక్షునిగా దండా సిద్ధార్థ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షునిగా కరణం సురేష్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment