చర్చలు జరుగుతుండగానే..
నాకు ఎకరం భూమి ఉంది. ఎప్పుడో మాకు ప్రభుత్వం డీ ఫారం పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి వరి సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. రోడ్డు కోసం మా భూమిని ప్రభుత్వం తీసుకుంటోంది. ఎకరాకు రూ.30 లక్షలు ఇస్తామంటున్నారు. జిరాయితీ భూములతో సమానంగా 60 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాం. ఒకపక్క పరిహారం కోసం చర్చలు జరుపుతూనే మరో పక్క పనులు ప్రారంభించడం సమంజసం కాదు.
– బొల్లం సూరిబాబు, కాగిత,
డీ ఫారం రైతు
రోడ్డున పడతాం..
డీ ఫారం భూములు కలిగిన వారికి కూడా జిరాయితీ భూములతో సమానంగా రూ.60 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. సగం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది సరికాదు. దళితులకు ఈ భూములు తప్ప ఏ ఆధారం లేదు. రోడ్డు కోసం భూములు ఇచ్చి మేమంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. పరిహారం విషయంలో మాకు న్యాయం జరగకపోతే భూములు ఇచ్చే ప్రసక్తి లేదు.
– చిట్టుమూరి సత్యనారాయణ,
రైతు, కాగిత
చర్చలు జరుగుతుండగానే..
Comments
Please login to add a commentAdd a comment