రోగులకు నాణ్యమైన సేవలందాలి
● వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్
అనంతపురం మెడికల్: రోగులకు నాణ్యమైన సేవలందించాలని సంబంధిత అధికారులను వైద్య ఆరోగ్యశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రం, రుద్రంపేటలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ విధానానికి సంబంధించిన రిపోర్టులు, ఓపీ సేవల వివరాలు, మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల అమలుపై సిబ్బందితో సమీక్షించారు. వైద్య సేవల్లో నాణ్యత పెంచడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డీఐఓ డాక్టర్ యుగంధర్, ఎన్‌హెచ్‌ఎం కిషోర్, ఫణి ఉన్నారు.
అమ్మలా లాలిస్తూ
అక్షరాలు నేర్పండి
కూడేరు: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను అమ్మలా లాలిస్తూ అక్షరాలు, మంచి నడవడిక నేర్పుతూ వారి ఉజ్వల భవితకు పునాదులు వేయాలని కార్యకర్తలకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న పిలుపునిచ్చారు. ‘పునాది స్థాయి అక్షరాస్యత, సంఖ్యా శాస్త్రం(ఎఫ్‌ఎల్‌ఎన్)’ కార్యక్రమం అమలుపై అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆరు రోజుల శిక్షణా తరగతులను మంగళవారం డీఈఓ ప్రసాద్‌బాబుతో కలసి ఆమె ప్రారంభించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్(ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ) శైలజ, ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ వనజా అక్కమ్మ హాజరయ్యారు. వినూత్న మాట్లాడుతూ.. అంగన్‌వాడీ స్థాయిలోనే పిల్లలకు చదువులపై ఆసక్తి పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పిల్లల పోషణపై అలసత్వం వీడాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, ఏసీడీపీఓ యల్లమ్మ, ఎంఈఓలు–1, 2 మహమ్మద్ గౌస్, సాయికృష్ణ, సూపర్ వైజర్లు రాజేశ్వరి, అరుణ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన సేవలందాలి
Comments
Please login to add a commentAdd a comment