చెలరేగిన ‘కేబుల్’ దొంగలు
యాడికి: మండలంలోని చందన గ్రామంలో కేబుల్ దొంగలు చెలరేగారు. తొమ్మిది మంది రైతులు బోరు బావులకు అనుసంధానం చేసిన విద్యుత్ కేబుల్‌ను సోమవారం రాత్రి కత్తిరించి ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం పంట పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి లబోదిబో మన్నారు. ప్రతి బోరు బావి వద్ద స్టార్టర్ పెట్టెలోని ఫీజులు తొలగించి, కేబుల్ వైర్లు కత్తిరించి అపహరించడం గమనార్హం. ఘటనతో ప్రతి రైతు రూ. వెయి, నుంచి రూ. 2వేల వరకూ నష్టం వాటిల్లింది. ఘటనపై పోలీసులకు బాధిత రైతులు ఓంకారయ్య, మధు, రామకృష్ణ, నాగేంద్ర, నాగయ్య, ఆదిరంగారెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు.
సరైన చికిత్సతో వంకర పాదాల సమస్య దూరం
అనంతపురం మెడికల్: సరైన చికిత్సను అందివ్వడం ద్వారా చిన్నారుల్లో వంకర పాదాల సమస్యను నయం చేయవచ్చునని అమెరికాకు చెందిన క్యూర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ట్రైనర్ డాక్టర్ బ్రూస్‌స్మిత్ సూచించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని డీఈఐసీను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థో విభాగాన్ని పరిశీలించి, అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వంకర పాదాలతో ఇబ్బంది పడుతున్న పలువురు చిన్నారులకు స్వయంగా చికిత్స చేయడంతో పాటు చికిత్స విధానాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ వంకరపాదాలతో ఇబ్బంది పడిన 78 మంది పిల్లలకు క్యూర్ ఇండియా సంస్థ తరఫున డీబీ స్ల్పిట్‌లను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థో హెచ్‌ఓడీ డాక్టర్ ఆత్మారాం, వైద్యులు డాక్టర్ సతీష్, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment