సెంట్రల్ వర్సిటీలో ఫీజులు నియంత్రించాలి
బుక్కరాయసముద్రం: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా అనంతపురంలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజుల నియంత్రించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు. సిద్దరాంపురం రోడ్డు సమీపంలో ఉన్న ఆర్డీటీ బధిరుల పాఠశాలలో అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ 3వ మహాసభ ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి జార్జ్ హాజరై, మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయి తరగతి గదులు, అమ్మాయిల వసతి భవనాలు ఏర్పాటు కాలేదన్నారు. వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కరువైందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటిలో ఫీజులు పెంచాడం దుర్మార్గమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
సెంట్రల్ యూనివర్శిటీ
విద్యార్థి సంఘం ఎన్నిక..
సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ సమక్షంలో 21 మందితో కమిటీను ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా అన్నా అననున్, కార్యదర్శిగా సూర్యవంశీ కృష్ణతో పాటు 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పరమేష్, కార్యదర్శి ఓతూర్, జిల్లా బాలికల విభాగం కన్వీనర్ రజిత, ఉపాధ్యక్షుడు గిరి, నాయకులు భీమేష్, సోము, సాయి, జీనత్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment