మానసిక వైద్యం గ్రామీణులకూ అందాలి
అనంతపురం మెడికల్: గ్రామీణ ప్రాంత ప్రజలకూ మానసిక వైద్యం అందేలా చూడాలని, ఆ దిశగా యువ వైద్యులు అడుగు వేయాలని మానసిక వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సవితా మల్హోత్రా పేర్కొన్నారు. రెండ్రోజులుగా అనంతపురం నగర శివారులోని ఓ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న జాతీయ స్థాయి మానసిక వైద్యుల నిరంతర వైద్య విద్యా సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ సవితా మల్హోత్రా మాట్లాడుతూ... చిన్నపాటి దగ్గు, జ్వరానికే గ్రామాల నుంచి ప్రజలు ఆస్పత్రులకు రావాలంటే సమయం తీసుకునే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఇలాంటి తరుణంలో మానసిక జబ్బుల తీవ్రతను వారు గుర్తించలేకపోతున్నారన్నారు. మానసిక జబ్బులపై గ్రామీణులను చైతన్య పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం సదస్సుకు పెద్ద ఎత్తున వైద్యులు హాజరుకావడానికి కృషి చేసిన జిల్లా సైకియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యండ్లూరి ప్రభాకర్‌ను ఆమె అభినందించారు. యండ్లూరి ప్రభాకర్‌తో పాటు సీనియర్ వైద్యులను సన్మానించారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పి.శైలజ హాజరు కాగా, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ టీపీ సుధాకర్, డాక్టర్ రమణరావు, డాక్టర్ జగదీష్, డాక్టర్ రఘురాం, డాక్టర్ వికాస్ మీనన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ లోకేశ్వరరెడ్డి, డాక్టర్ శరత్‌చంద్ర, డాక్టర్ రాధికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మానసిక వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సవితా మల్హోత్రా
Comments
Please login to add a commentAdd a comment