798 మంది విద్యార్థుల గైర్హాజరు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–1 పరీక్షకు జిల్లాలో 798 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యా ర్థులు 24,452 మందికి 23,789 మంది హాజరయ్యారు. 663 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 2,475 మందికి 2,340 మంది హాజరయ్యారు. 135 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణనాయక్ 3 పరీక్షా కేంద్రాలు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 5, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 14, కస్టోడియన్లు 13 కేంద్రాలను తనిఖీ చేశారు.
నాటుసారా నిర్మూలనే లక్ష్యం
అనంతపురం అర్బన్: నాటుసారా నిర్మూలనే లక్ష్యంగా ‘నవోదయం 2.0’ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నవోదయం 2.0’ కళాజాత ప్రచార వాహనాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటుసారా సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి, సూపరింటెండెంట్ రామ్మోహన్‌రెడ్డి, సీఐలు జయనాథ్, సత్యనారాయణ, ఎస్‌ఐలు జాకీర్‌హుసేన్, కృష్ణారెడ్డి, కళాజాత బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వెబ్‌సైట్‌లో ‘పది’ హాల్‌టికెట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.వాట్సాప్ మనమిత్ర నంబరు 95523 00009 ద్వారా హాల్‌టికెట్లు పొంద వచ్చన్నారు. అలాగే www.bse. ap.gov.in వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్లలో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, మీడియం, ఫొటో, సంతకం తదితర వివరాలు తప్పుగా ఉంటే వెంటనే ప్రధానోపాధ్యాయుల ద్వారా dir_govexams@yahoo.com మెయిల్‌కు ఫిర్యాదు చేయాలని డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ తెలిపారు. అనంతపురంలోని పాత డీఈఓ కార్యాలయం, ప్రభుత్వ పరీక్షల విభాగంలో కూడా సంప్రదించవచ్చని సూచించారు.
నెలాఖరు వరకూ
ఆ ప్యాసింజర్ రైళ్లు తిరగవ్!
గుంతకల్లు: కుంభమేళాకు వెళ్లిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి గుంతకల్లు డివిజన్ చేరుకునేందుకు ఈ నెలాఖరు వరకూ పడుతుందని డివిజన్ అధికారులు తెలిపారు.ఈ క్రమంలో తిరుపతి–కదిరిదేవరపల్లి (57405) ప్యాసింజర్ రద్దును ఈ నెల 30 వరకూ పొడిగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కదిరిదేవరపల్లి–తిరుపతి (57406) ప్యాసింజర్‌ను ఈ నెల 31 వరకు, గుంతకల్లు–తిరుపతి (57404) ప్యాసింజర్ 30 వరకు, తిరుపతి–గుంతకల్లు (57403) ప్యాసింజర్ ఈ నెల 31 వరకు తిరగవన్నారు. తిరుపతి–హుబ్లీ (57401) ప్యాసింజర్‌ను ఈ నెల 15 వరకు, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్ రద్దును ఈ నెల 16 వరకూ పొడిగించినట్లు వెల్లడించారు.
798 మంది విద్యార్థుల గైర్హాజరు
798 మంది విద్యార్థుల గైర్హాజరు
798 మంది విద్యార్థుల గైర్హాజరు
Comments
Please login to add a commentAdd a comment