ట్రాప్.. గప్‌చుప్!
దిక్కులేని ఏసీబీ
● జిల్లాలో వేళ్లూనుకుపోతున్న అవినీతి
● ట్రాప్ చేయలేకపోతున్న ఏసీబీ
● కూటమి సర్కారు వచ్చాక నిర్వీర్యం
● అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఓ వ్యక్తి భూమి పోయింది. ఇందుకు పరిహారం మంజూరు కోసం బాధితుడు మున్సిపాలిటీ అధికారులను ఆశ్రయించగా.. ఓ మహిళా అధికారి
రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు
ఇవ్వలేదనే కారణంతో మూడేళ్లుగా
అతడిని తిప్పించుకుంటున్నారు.
● అనంతపురంలోని రాజు రోడ్డులో ఓ బంగారు నగల దుకాణ భవనం నిర్మాణమవుతోంది. ఇక్కడ సెల్లార్‌లోకి వెళ్లేందుకు ర్యాంప్ వేశారు. ర్యాంప్ కారణంగా వర్షం నీళ్లు సరిగా వెళ్లవంటూ ఇటీవల మున్సిపల్ సిబ్బంది ఆ భవన నిర్మాణం వద్ద కూర్చున్నారు. ‘మమ్మల్ని మున్సిపల్ అధికారి మంజుల మేడం పంపించారు. మాకెంతో కొంత ఇస్తేగానీ వెళ్లం’ అంటూ తెగేసి చెప్పారు.
● అనంతపురం ఆర్డీఓ కార్యాలయానికి ఇటీవల శింగనమలకు చెందిన ఓ వ్యక్తి భూమి కన్వర్షన్ కోసం వెళ్లారు. ‘రూ.3 లక్షలు ఇస్తేనే పని పూర్తి చేస్తాం’ అంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు కరాఖండీగా చెప్పారు. వారు అడిగినంత ముట్టజెప్పి బాధిత రైతు పని పూర్తి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment