ప్రభుత్వ మెడలు వంచుతాం
ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజల పక్షంగా వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, కరెంటు బిల్లులు తగ్గించాలని ఇప్పటికే వినతి పత్రాలు అందించాం. ప్రభుత్వంలో మార్పు రాకపోతే మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యక్ష పోరుకు దిగుతాం. కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా పథకాలు అమలు చేయిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.4,600 కోట్లు ఉంటే గత ఏడాది ఈ సర్కారు ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. ఏటా ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,600 కోట్లే. 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వాటిని విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ 17 వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు కళాశాలలు అవసరం లేదని, ఉన్న కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని కుట్ర చేస్తోంది.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment