దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్
తాడిపత్రి: చుక్కలూరు పారిశ్రామికవాడలో రెండు రోజుల క్రితం మహిళను బెదిరించి రూ.10 వేలు దోచుకెళ్లిన ఘటనలో రూరల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశార. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివవగంగాధర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పారిశ్రామిక వాడలోని ఓ నల్లబండల పరిశ్రమను వెంకటేశ్వరమ్మ, కళాచారి దంపతులు బాడుగకు తీసుకుని నడుపుతున్నారు. ఈ నెల 14న తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామానికి చెందిన నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడులు ద్విచక్రవాహనంపై నల్లబండల పరిశ్రమ వద్దకు వెళ్లారు. అక్కడ కళాచారిని ఒకరు మాటల్లో పెట్టి.. మరొకరు ఇంట్లోకి చొరబడి వెంకటేశ్వరమ్మను గొంతు పిసికి, చంపుతామని, బెదిరించి, ఆమె వద్ద ఉన్న రూ.10 వేల నగదు లాక్కుని బైక్‌పై ఉడాయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నాగేంద్ర అలియాస్ కొక్లీ, సుబ్బరాయుడును చుక్కలూరు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్లు రూరల్ సీఐ తెలిపారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన రూరల్ ఎస్‌ఐ ధరణీబాబు, ఏఎస్‌ఐ కాటమయ్య, కానిస్టేబుళ్లు అంకన్న, సుధాకర్‌లను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment