సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం | - | Sakshi
Sakshi News home page

సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం

Published Mon, Mar 17 2025 9:50 AM | Last Updated on Mon, Mar 17 2025 11:27 AM

సూర్య

సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం

కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం 1
1/1

సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement